రానున్న మున్సిపల్ ఎన్నికలకు సీపీఐ సంసిద్ధం

నంద్యాలలో 2, 5 వార్డుల్లో పోటీ

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఎన్ రసూల్

మాట్లాడుతున్న సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రసూల్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రానున్న మున్సిపల్ ఎన్నికలకు సీపీఐ సంసిద్ధమని,.నంద్యాలలో 2, 5 వార్డుల్లో సీపీఐ పోటీ చేయనున్నట్లు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఎన్ రసూల్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున నంద్యాలలో 2, 5 వార్డుల్లో పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థుల గెలుపు కోసం నంద్యాల సీపీఐ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం ఎఐటియుసి  నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రసూల్ పాల్గొని మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అనేక రకాలుగా ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు నిర్వహించే పేదల పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, ఆ పార్టీ అభ్యర్థులు నంద్యాలలో 2, 5 వార్డుల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నంద్యాల నియోజకవర్గ, పట్టణ కార్యదర్శులు బాబా ఫక్రుద్దీన్, ప్రసాద్, ఎఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నాగరాముడు, ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, మహానంది మండల కార్యదర్శి సామెయేలు, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి సోమన్న, ఎఐటియుసి కార్యదర్శి బాల వెంకట్, మహిళ సమాఖ్య నాయకురాలు నారాయణమ్మ, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు హరికృష్ణ, ఎఐవైఎఫ్ నంద్యాల పట్టణ అధ్యక్షుడు చైతన్య, కార్యదర్శి విష్ణు, సురేష్, సీపీఐ శాఖ కార్యదర్శులు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: