సిఎం జన్మదినోత్సవం సందర్భంగా కోటి వృక్షోత్సవం

ఈ నెల 17 న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి)

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17 వ తేదీన కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను శనివారం విడుదల చేశారు. హోం మంత్రి మహమూద్ అలీ, ఐటి శాఖ మంత్రి కే. తారక రామారావు, సంతోష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరిప్రియ, మాలోతు కవిత పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం హరిత తెలంగాణ దిశగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ప్రతీ ఒక్కరూ ఒక మొక్క నాటి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని మంత్రి సంతోష్ రెడ్డి సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిశగా అడుగులు ముందుకు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత పరిరక్షణ కోసం అందరూ నడుం బిగించాలని కోరారు. అన్నీ గ్రామాలు పచ్చదనంతో కళకళలాడే లా ఉండాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ తో పాటు మున్సిపాలిటీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. 

✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్....హైదరాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: