SKLS గేలాక్సీ మాల్‌ చిత్రం టైటిల్....

`బ్లాక్ n వైట్`

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

SKLS గేలాక్సీ మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా బృంద ర‌వింద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో E. మోహ‌న్ నిర్మాత‌గా ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే..నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా  ఈ చిత్రానికి  `బ్లాక్ n వైట్` టైటిల్‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ  వీడియోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల‌చేయ‌నున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కుడు బృంద ర‌వింద‌ర్ మాట్లాడుతూ  -  ``న్యూ ఇయ‌ర్ రోజున మా మూవీ టైటిల్ `బ్లాక్ n వైట్`ను అనౌన్స్ చేయ‌డం హ్యాపీగా  ఉంది. ఒక డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ ని విడుద‌ల చేస్తాం``అన్నారు.

నిర్మాత  E. మోహ‌న్ మాట్లాడుతూ - ``బ్లాక్ n వైట్ అనే  ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఆడియ‌న్స్‌ని త‌ప్ప‌కుండా థ్రిల్ చేస్తుంది`` అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గుడిమిట్ల శివ ప్ర‌సాద్ - ``బ్లాక్ n వైట్' టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. త్వ‌ర‌లోనే న‌టీన‌టుల వివ‌రాలు ప్ర‌క‌టిస్తాం`` అన్నారు.

ఈ చిత్రానికి

సినిమాటోగ్రాఫ‌ర్: ఈశ్వ‌ర్ ఎల్లుమ‌హంతి,

సంగీతం: మ‌ణిశ‌ర్మ‌,

ఎడిటింగ్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర రావు,

లిరిక్స్: అనంత్ శ్రీ‌రామ్‌,

అడిష‌న‌ల్ డైలాగ్స్‌: విజ‌య భార‌తి,

స్క్రిప్ట్ అసిస్టెన్స్‌‌: బి. వ‌సుదేవ రెడ్డి,

ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: అనిల్- భాను,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: గుడిమిట్ల శివ ప్ర‌సాద్‌,

నిర్మాత: E. మోహ‌న్,

క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు‌, ద‌ర్శ‌క‌త్వం: బృంద ర‌వింద‌ర్‌‌.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: