ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి

మార్కాపురం డిఎస్పీ కిషోర్ కుమార్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

రాష్టంలో నిర్వహించే పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా మార్కాపూరం డిఎస్పీ కిషోర్ కుమార్, మార్కాపూరం రూరల్ ఎస్సై, స్టేషన్ సిబ్బందితో కలిసి గొట్టిపడియ గ్రామంలో  సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. అదే విధంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా, వారికి నచ్చిన అభ్యర్థికి వారు స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపించుకోవాలని సూచించారు.

డిఎస్పీ కిషోర్ కుమార్

ఏదైనా గ్రామంలో ఎన్నికల సందర్భంగా గొడవలు జరిగే అవకాశం ఉంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అపుడే సమయానికి పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే అవకాశముంటుందదని ఈ సందర్భంగా ఆయన తెలియచేశారు.


 

 

✍️రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: