అఘాయిత్యానికి పాల్పడిన గోమారి కాశీ ని ఉరి తీయాలి

ఎమ్మార్పీఎస్ డిమాండ్

ఎన్ని చట్టాలు వచ్చిన మానవ మృగాలు  మారడంలేదు

అత్యాచారయత్నానికి పాల్పడిన దుర్మార్గున్ని వెంటనే శిక్షించాలి

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకు వచ్చిన మానవ మృగాలు తీరు మారడం లేదని ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్ర మాదిగ అన్నారు.రాష్ట్రంలో దళితుల, గిరిజనుల మహిళలపై రోజురోజుకు అత్యాచారాల పాల్పడుతూ ప్రాణాలు అరిచేతులో పెటుకుంటున మానవ మృగాలును ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం పట్లా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎస్సీ ఎస్టీ మహిళలుపై అగ్రకులాల పురుషులు మనిషి అనే పదాని మరిచిపోయి మహిళలను అతి కిరాతకంగా హత్యాయత్నానికి పాల్పడుతున్నావారని  వెంటనే పోలీసు అధికారులు శిక్షించి ఉరితీయాలని అన్నారు.
శుక్రవారం సాయంత్రం పత్తికొండ మండల పరిధిలోని పందికోన గ్రామానికి చెందిన ఎస్టీ కులం అయినా యానాది శ్రీనువాసులు దంపతులు కుమార్తె యానాది.వాణి షన్మక ప్రీయ 7సంవత్సరాలు గల ముక్కు పచ్చలారిని పసికందును అదే గ్రామానికి చెందిన అగ్రకులానికి చెందిన బోయ గోమారి కాశీ నీచంగా అత్యాయత్నానికి పాల్పడిన మానవమృగాని శిక్షించి ఉరితీయాలని శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలుకు అతీతంగా దళిత నాయకులంతా పెద్ద ఎత్తున పాల్గొని స్టేట్ బ్యాంకు దగ్గర నుండి పురవీధుల గుండా స్థానిక నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీతో తరలి వచ్చి ధర్నా నిర్వహించారు.ఈకార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అద్యక్షులు సుభాష్ చంద్ర మాదిగ అద్యక్షత వహించగా ముఖ్యఅతిథిలుగా సీనియర్ దళిత నాయకులు ముత్యాల తిరుపాల్.పందికోన వెంకటేష్.పగిడిరాయి వెంకటరాముడు.బీ.జే.పీ. ఇంచార్జ్ రంగ గౌడ్. రామకొండ వెంకటేష తదితరులు పాల్గొన్నారు.



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: