ప్రభుత్వాలకు ప్రజలకు వారధులు

చిన్నారులకు రక్తదాతలు.. పాత్రికేయులు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

సమాజంలో ప్రభుత్వాలకు, ప్రజలకు వారధులు పాత్రికేయులు. ఉదయం నుంచి రాత్రివరకు అలసట చెందకుండా వార్తలకోసం పరితపిస్తారు. చిన్న సంఘటన  నుంచి పెద్ద సంఘన వరకు ధైర్యంగా ముందుకు వెళ్లి సమాచారం అందరికి చేరవేస్తారు. పోటీ ప్రపంచంలో తమ కడుపులు నిండకున్నా నలుగురు పాత్రికేయులు రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పి ఆర్ కుమార్, పి.సురేష్, ఎం అబ్దుల్ రావూఫ్, పఠాన్ షారూక్ లు ఆదివారం చిన్నారులకు రక్తదానం చేశారు. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు రక్తం అవసరం కావడంతో రక్త దాత దాదాబాయ్ వీరిని సంప్రదించారు.
అడిగిన వెంటనే నలుగురు పాత్రికేయులు విజయ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. పాత్రికేయులు నలుగురు గత 10 ఏళ్లుగా ఏడాదికి రెండుసార్లు రక్తదానం చేస్తున్నారు. సమాజంలో డబ్బుకంటే ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలబడాలని వారందరికీ, చిన్న తనంలోనే దాదాబాయ్ చేస్తున్న మంచిపనికి వేడినీళ్లలో చన్నీళ్ళలా ఈ పాత్రికేయులు ఆయనతో కలిసి రక్తదానం చేస్తూ మరెందరితో  రక్తదానం చేయిస్తూ ఎందరి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: