అయ్యలూరు ఎన్నికల పోలింగ్ కేంద్రంను...

ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ .వీరపాండియన్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల మండలం అయ్యలూరు గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రంను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ వేసే గదితో పాటు ఓటు వేసే పోలింగ్ కేంద్రంను జిల్లా కలెక్టర్,  జిల్లా ఎన్నికల అథారిటీ జి. వీరపాండియన్ పరిశీలించారు. ఓటర్లు ఎంతమంది ఉన్నారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓటింగ్ సంబంధించి ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని తాసిల్దార్ కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, డి.ఎస్.పి చిదానంద రెడ్డి, నంద్యాల తాసిల్దార్ రవికుమార్, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: