భారతీయులందరికీ  స్వేఛ్చ లభించినట్టు వంటి రోజు ఈ రోజు 

నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

భారతీయులందరికీ  స్వేఛ్చ లభించినటువంటి రోజు ఈ రోజు అని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. మంగళవారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి హరినాథ్ రావు, కోనేటి రంగారావు కమిటీ తహసీల్దార్ జనార్ధన శెట్టి లతో కలసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జనగణమన గీతా లాపన గావించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ ఈరోజు జరిగే గణతంత్ర దినోత్సవాన్ని ఢిల్లీలోని ఎర్రకోట భవనం మొదలుకొని గ్రామ స్థాయిలోని కార్యాలయాల వరకు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. గణతంత్ర దినోత్సవం నుండి దేశంలోని ప్రజలకు స్వేచ్ఛ కలిగిందని మన భారతదేశము కులాలకు మతాలకు అతీతంగా సర్వమతాల భిన్నంగా ఉన్న దేశం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కలిగినటువంటి మన భారతదేశం అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: