జలియన్ వాలా బాగ్ యోధుడు...

జామియా మిల్లియా విశ్వవిద్యాలయ స్థాపకుడు సైఫుద్దీన్ కీచ్లు జయంతి

హిందూ ముస్లిం ఐక్యతకు ఉద్యమించి 

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

శాంతి ఉద్యమకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు సైఫుద్దీన్ కీచ్లు జయంతిని ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన హిందూపురం పట్టణంలోని సద్భావన సర్కిల్ లో ఘనంగా జరుపుకున్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ఇంగ్లాడ్ లో బారిష్టర్ చదువుకున్న తర్వాత సైఫుద్దీన్ కీచ్లు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ఖిలాఫత్ ఉద్యమం ఆతర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులపై అణిచివేసే చట్టాలు రౌలత్ చట్టం ప్రయోగిస్తే సైఫుద్దీన్ కీచ్లు బ్రిటిష్ వారి సైన్యంలో ఉన్న భారతీయులు బ్రిటిష్ సైన్యం ఊడిగం చేయవద్దని బ్రిటిష్ అధ్వర్యంలో సైనిక ఉద్యోగాలు బహిష్కరించి బయటకు రావాలని పిలుపు నిస్తే బ్రిటిష్ ప్రభుత్వం సైఫుద్దీన్ కీచ్లు సత్యపాల్ శంకరాచార్య ను చెరసాలలో బంధించింది.
14యేండ్లు మాతృభూమి కోసం ఉద్యమించి జైలు జీవితం గడిపిన ధీరుడు రష్యా స్టాలిన్ అవార్డును స్వీకరించిన తొలి భారతీయుడు అవార్డుతో పాటు 1లక్షరూపాయలు అవార్డు రూపంలో వచ్చిన సొమ్మును దేశ శాంతి కోసం జమచేసి ప్రపంచ శాంతి సంఘంలో ఉపాధ్యక్షుడిగా దేశంలో శాంతి సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని జిన్నా ప్రతిపాదన ద్విజాతి సిద్ధాంతం ను ఖరాఖండిగా వ్యతిరేకించిన మహా దేశభక్తుడు సైఫుద్దీన్ కీచ్లు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఇందాద్.రియాజ్.ఫైరోజ్ అలీ ముతవల్లీ హాజీ సుభాన్.రఫీఖ్. లియాఖత్అలీ.సలహుదీన్ తదితరులు పాల్గొన్నారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: