కళా వెంకట్రావు అరెస్ట్ అప్రజాస్వామిక 

ధర్మపరిరక్షణ యాత్రను అడ్డుకోవడం దుర్మార్గం

మతసామరస్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలం

స్థానిక ఎన్నికలు హైకోర్టు తీర్పు శుభపరిణామం

బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే ఏలూరి

(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

వివాదరహితుడు,మాజీ మంత్రి  కళా వెంకట్రావు అరెస్టు అప్రజాస్వామికమని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేత కళా వెంకటరావు అక్రమ అరెస్టును ఆయన ఖండిస్తూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో  కళా మచ్చలేని  నేతగా నిలిచారని, అలాంటి వ్యక్తి పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతిచ్చిన ప్రభుత్వం  తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనందబాబు, నిమ్మల రామానాయుడు, అమర్నాథ్ రెడ్డి లను నేతలను బయటకు రాకుండా   తిరుపతిలో గృహనిర్బంధం చేయడం దారుణమన్నారు. మత సామరస్యాన్ని కాపాడాల్సిన అధికార యంత్రాంగం, ప్రభుత్వం చోద్యం చూస్తుదన్నారు. 

పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తీర్పు ఒక  శుభపరిణామమన్నారు. అరాచకాలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారన్నారు. స్థానిక సంస్థలకు పాలకవర్గాల తోనే పల్లెలు అభివృద్ధి చెబుతాయన్నారు. మూడేళ్లుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల పై నమ్మకం ఉంచి రాజ్యాంగాన్ని కాపాడాలన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: