రాష్ట్రంలో ఉన్మాద పాలన

టీడీపీ అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్ బాబు 

(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి గారి పాలన లో రాష్ట్రంలో ఉన్మాదం పెరిగింది అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్ బాబు  వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. టిడిపి సీనియర్ నాయకులు కళావెంకట్రావు గారిని రాత్రి పూట ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లుగా చెయ్యడం చాలా దుర్మార్గం. ఒక బి.సి నేతపై తప్పుడు కేసులు పెట్టి వేధించటం పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేయటం తగదు అని ఎరిక్షన్ బాబు అన్నారు. రామతీర్ధంలో రాముని తల తీసేసిన వారిని పోలీసులు ప్రభుత్వం పట్టించుకోకుండా చట్టాన్ని గాలికి వదిలేసి కళావెంకట్రావుగారిని అక్రమ నిర్బంధం చయ్యడం ఇది జగన్ మోహన రెడ్డి ప్రభుత్వ ఉన్మాద చర్య అని ఎరిక్షన్ బాబు అన్నారు.

ఎవరో ఖాళీ  బాటిల్ కారు పై విసిరి తే హత్యాయత్న కేసు నమోదు చెయ్యడం పోలీసులు దుశ్చర్య అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరు మారాలి. దేవాలయలపై దాడులు ను ఖండిస్తే అరెస్టు లు చేస్తారా .అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రజలను ప్రతిపక్షాల ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి లో ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతిచ్చి మరలా రద్దుచేయడం అనేది  ప్రజా స్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఆయన అన్నారు. పోలీసుల పహరాలో రాష్ట్రం ఉంది ప్రజలు భయంగా బ్రతుకుతున్నారు. శాంతి భద్రతలు లోపించాయ్ అని ఎరిక్షన్ బాబు జగన్ మోహన రెడ్డి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.పోలీసు వ్యవస్థ పై ప్రజల కు నమ్మకాన్ని కలిగించే విధంగా పాలనలో మార్పులు తీసుకుని రావలసిందిగా డిజిపి గారి ని కోరుకుంటున్నాను అని గూడూరి ఏరిక్షన్ బాబు తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: