సాకారం కానున్న పశ్చిమ ప్రజల కోరిక.
వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగ నిర్మాణం పూర్తి.
ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ధ వల్లే సాధ్యం.
చురుగ్గా రెండో సొరంగ నిర్మాణ పనులు.
రాష్ట్ర వైసిపి నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి హర్షం.
(జానో జాగో వెబ్ న్యూస్ విజయవాడ ప్రతినిధి)
పశ్చిమ ప్రాంత ప్రజల కళ సాకారం కానుందని అందులో భాగంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగ నిర్మాణ పనులు పూర్తి కావడం హర్షణీయమని రాష్ట్ర వైసిపి నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.
నాటి స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 వ సంవత్సరంలో ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆనాడు వేగంగా జరిగాయని, అయితే వైయస్ మరణంతో అర్ధాంతరంగ పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. తిరిగి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో నిధులు కేటాయింపుతో ఏళ్ల తరబడి సాగుతున్న సొరంగ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావడమే గాక మిగతా నిర్మాణ పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయని ఆయన అన్నారు, ఈ సందర్భంగా జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతల తెలుపుతున్నామని అన్నారు.
మొదటి నుండి కూడా వైఎస్ కుటుంబం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ రైతు పక్ష పాతిగా మారిపోయారని, అందువల్లనే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వెనకడుగు వేయకుండా వేల కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారని గుర్తు చేశారు. మొదటి సొరంగం మొత్తం18.800 కిలోమీటర్ల తవ్వాల్సి వుండగా వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందే నాటికి 10.520 కిలోమీటర్ల మేర తవ్వారని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో 4.480 కిలోమీటర్లు, చంద్రబాబు కాలంలో కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారని అన్నారు. అనంతరం వైస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే 3.200 కిలోమీటర్ల మేర త్రవ్వడం జరిగిందని అన్నారు. సొరంగ నిర్మాణ పనులే గాకుండా ముంపు గ్రామాల ప్రజలకు నష్ట పరిహారాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకొంటున్నారని అన్నారు. పునరావాసానికి సంబంధించి సత్వరమే బాధితులకు న్యాయం చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం వెలిగొండపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని అన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నదని అయితే వైసీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా పశ్చిమ ప్రకాశం అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుందని అందువల్లనే ఒక్క వెలిగొండతో ఆగిపోకుండా మెడికల్ కాలేజి, కిడ్నీ రీసెర్చి సెంటర్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
పశ్చిమ ప్రజల వరప్రసాదిని అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలోని 32 మండలాలలోని 4 లక్షల 32 వేల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందడంతో పాటు ఎంతో వెనుకబడిన ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.
Post A Comment:
0 comments: