రైతుల నుంచి అర్జీల స్వీకరణ

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

స్ధానిక తర్లుపాడు మండల వ్యవసాయ కార్యలయము నందు 2019వ సంవత్సరానికి సంబంధించి కంది, పత్తి మరియు మొక్కజొన్న ఖరీఫ్ పంటల భీమ సొమ్ము రానటువంటి రైతుల నుండి మండల స్ధాయిలో అర్జీలను స్వీకరించడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య పరిశీలకులుగా సహాయ వ్యవసాయ సంచాలకులు భూసార పరిక్ష కేంద్రము ఒంగోలు ఇ. నిర్మల కుమారి పాల్గొని రైతులకు వున్న సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. తగు చర్యల నిమిత్తము అన్ని గ్రామల నుండి మొత్తం 324 అర్జీలు స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమములో తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి ఆర్. చంద్రశేఖర్, ఎ.ఇ.ఓ. ఎన్. ఆదిగణేష్, మండలములోని అన్ని సచివాలయాలలోని గ్రామ,వ్యవసాయ సహాయకులు (వి.ఎ.ఎ.) పాల్గొని రైతుల నుండి అర్జీలను స్వీకరించారు. 
 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: