దివ్యాంగుల ,కళారాధన, క్రీడా కార్యాలయంలో...

రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రిపబ్లిక్ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న దివ్యాంగుల సంక్షేమ సంఘం, కళారాధన, క్రీడా కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి, గౌరవ సలహాదారు లైన్స్ క్లబ్ రీజినల్ చైర్మన్ ఎం.పివి. రమణయ్య, ఉపాధ్యక్షులు వెంకట్రావు, కార్యదర్శి చలపతి మురళీధర్, కార్యాలయం కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్  రవి కృష్ణ మాట్లాడుతూ ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3న కరోనా నేపద్యంలో నిర్వహించలేక పోయామని, అందుకే ఫిబ్రవరి మొదటి ఆదివారం నుండి ఎనిమిది నెలల పాటు ప్రతి ఆదివారము దివ్యాంగుల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: