ఆ కేసుల విచారణకు...
ప్రత్యేక కోర్టు ఏర్పాటు
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లా, నియోజక వర్గ ఎం.పి., ఎమ్మెల్యే, ఎమ్మెల్సిలపై గతంలో నమోదైన కేసుల విచారణకు నాంపల్లి క్రిమినల్ కోర్టులో ప్రత్యేక కోర్టు ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేతలపై ఉన్న కేసుల ను పూర్తి చేసేందుకు ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణలోని అన్ని జిల్లా నియోజక వర్గ ఎమ్మెల్యే, ఎం.పి, ఎమ్మెల్సిలంతా నాంపల్లి కోర్టు కు హాజరవుతున్నారు. ప్రత్యేక కోర్టు జడ్జి గా వరప్రసాద్ ను నియమించారు. తెరాస, కాంగ్రెస్, ఎం ఐ ఎం, బిజెపి, లకు చెందిన నేతలతో పాటు కార్యకర్తల పై నమోదైన కేసుల ను పూర్తి చేసేందుకు ప్రత్యేక కోర్టు కృషి చేస్తోంది. బిజెపికి చెందిన నేతలు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజా సింగ్ తో పాటు అనుచరులు హాజరు అవుతున్నారు. కోర్టు నియమ, నిబంధనల ప్రకారం ఆదేశాలను జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టు కు నేతల తాకిడి పెరిగిపోయింది. ఒకే ఒక్క ప్రత్యేక కోర్టు ను ఏర్పాటు చేయడంతో కోర్టు కిక్కిరిసి పోతోంది. అన్నీ జిల్లాలకు చెందిన కేసులు నాంపల్లి కోర్టు కు బదిలీ చేయబడ్డాయి. తెరాస కు చెందిన జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సీతక్క, ఎంపి. రేవంత్ రెడ్డిల పై ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక కోర్టు విచారణ ను వేగవంతం చేస్తుంది. అలాగే ఎం ఐ ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు వారి అనుచరులు హాజరు అవుతున్నారు. ఎన్నికల సమయంలో పోలీసులు నేతలపై కేసులు నమో దు చేసిన విషయం తెలిసిందే. పోలీసు అధికారులు సైతం సాక్ష్యం చెప్పడానికి హాజరు కావాల్సి ఉంటుంది. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నేతలపై ఉన్న కేసుల విచారణ ప్రక్రియ పూర్తి చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటోంది. ధర్నాలు, ర్యాలీలు, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు ఆయా ప్రాంతాల్లోని పోలీసు అధికారులు కేసులను నమోదు చేశారు. గతంలో నమోదైన కేసులన్నీ పెండింగ్ లో ఉన్నందున ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ సాక్షుల వివరణలు నమోదు చేస్తోంది. ప్రచార నిబంధనలను అతిక్రమించి డబ్బులు పంపిణీ చేసిన వారిపై కూడా పోలీసులు కేసులు రిజిష్టర్ చేశారు. అన్ని తరహా కేసుల విచారణను కోర్టు స్వీ కరిస్తోంది.
రిపోర్టింగ్--డి. అనంత రఘు
అడ్వకేట్
Post A Comment:
0 comments: