విదేశి ఉపకారవేతనాలు విడుదల చేయాలి

యూనుస్ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

గత ప్రభుత్వం లో బకాయిలు వున్న విదేశి ఉపకారవేతనాలు వెంటనే విడుదల చెయ్యాలని  ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.ఏం. డి.యూనుస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనుస్ మాట్లాడుతూ 350 మంది మైనారిటీ విద్యార్థులు విదేశాలలో విద్యను అభ్యసిస్తన్నారని, గత టీడిపి ప్రభుత్వం ఒక విడత నిధులను విడుదల చేసిందని మిగతా నిధులను విడుదల చెయ్యాలని యూనుస్ కోరారు. వీరికి ఇరవై ఏడు కోట్ల యాభై లక్షలు రూపాయలు రావలసి వుందని వెంటనే నిధులను విడుదల చెయ్యాలని యూనుస్ కోరారు. నిధులు విడుదల కాక విదేశాలలో మైనారిటీ  ముస్లిం విద్యార్థులు విదేశాలలో చాలా ఇబ్బంది పడుతున్నారని వారికి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని యూనుస్ కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: