నంద్యాలలో పిజి విద్యార్థి అత్మహత్యయత్నం

అత్మహత్యయత్నానికి పాల్పడ్డ పిజి విద్యార్థి విజయ్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఒక ప్రముఖ పీజీ కళాశాల ల్యాబ్ నందు విజయ్ అనే విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతుండగా ల్యాబ్ లోనే పడిపోవడంతో గుర్తించిన కళాశాల సిబ్బంది అతన్ని హుటాహుటిగా చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మాట్లాడుతున్న విద్యార్థి తండ్రి

ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి మాట్లాడుతూ తమ కుమారుడు గత కొన్ని రోజుల నుంచి మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడని,  దానికి వైద్యుల వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని, అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నందున మూడు రోజుల నుంచి కాలేజీకి వస్తున్నాడని, ఈరోజు ప్రాక్టికల్ చివరిరోజు అయిపోగానే మళ్ళీ వైద్యం నిమిత్తం కర్నూలు వెళ్ళవలసి ఉందని అంతలోనే ఇలా చేస్తాడని అనుకోలేదని, దీనికి ఎవరు కారణం కాదని మా అబ్బాయి మానసిక ఆరోగ్యం సరిగా లేనందువలన ఇలా చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని బాధితుడి తండ్రి తెలిపారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: