లెనిన్ ఆశయాలను కొనసాగాలి

విద్యార్థి యువత లెనిన్ ని స్పూర్తి ని తీసుకోవాలి

పీవైఎల్-పీడీఎస్ యూ

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)

లెనిన్ మహాసాయుని  97వ వర్ధంతి పురస్కరించుకుని పీవైఎల్-పీడీఎస్ యూ ఆధ్వర్యంలో వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. గురువారం  నందికొట్కూరులో స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు ఘనంగా విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా నాయకులు యు నవీన్ కుమార్  మాట్లాడుతూ  విద్యార్థి దశనుంచే లెనిన్ విప్లవ బావాలు అలవర్చుకొని రష్యా జాన్ చక్రవర్తుల నిరంకుశపలన వ్యతిరేకంగా శ్రామికులను ఐక్యం చేసి జాన్ చక్రవర్తులు నిరంకుశ పాలన చరమగీతం పాడి
బోల్సివీక్ విప్లవాన్ని విజయవంతం చేసిన మహనీయులు లెనిన్ అని ఆయన పోరాట పటిమను కొనియడాదు ప్రపంచంలో మొట్ట మొదట సామ్యవాద ప్రభుత్వాన్ని రష్యాలో ఏర్పాటు చేసి కమ్యూనిస్టులకు,విప్లవకారులకు స్ఫూర్తి నిచ్చిన వ్యక్తి లెనిన్ అన్నారు ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల జీవితాన్ని వెలుగునింపిన వ్యక్తి లెనిన్ అన్నారు లెనిన్ ఆశయసాధనకు మనమంతా కృషి చేయాలని లెనిన్ చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ డివిజన్ అధ్యక్షులు అఖిల్ పీవైఎల్ డివిజన్ నాయకులు రాంబాబు, విజయ్, శివ, మధు, రవి, మొదలైన వారు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: