ఎన్.టి.ఆర్ వర్ధంతి సందర్బంగా రక్తదానం
హాజరైన సీనియర్ నేతలు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
తెలుగువారి ఆరాధ్యదైవం, గొప్ప నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్.టి.రామారావు 25వ వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీనివాస సెంటర్లో ఉన్న ఎన్.టి.రామారావు విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ ఎన్ఎమ్ డి ఫరూక్, మాజీ మంత్రివర్యులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, తెలుగుయువత రాష్ట్ర నాయకులు ఎన్.ఎమ్.డి.ఫిరోజ్ లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక రాజ్ థియోటర్లో నిర్వహించిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్స్, వార్డు ఇంచార్జీ లు, నంద్యాల, గోస్పాడు మండల నాయకులు పాల్గొని సుమారుగా 50 మంది రక్తదానం చేశారు.
Post A Comment:
0 comments: