అట్టడుగు వర్గాలు...స్త్రీల విద్య కోసం

సావిత్రి భాయి పూలే సేవలు మరవ లేనివి

జానోజాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా

మాసూల్దార్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ సొసైటీ అధ్వర్యంలో సావిత్రి భాయి పూలే జయంతి

నివాళ్లలర్పించిన నేతలు

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

విద్య అంటేనే ఉన్నత వర్గాలకు మాత్రమే అనే రోజుల్లో నాడు అట్టడుగు, బలహీనవర్గాల, స్త్రీల విద్య కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి సావిత్రి భాయి పూలేనని జానోజాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా పేర్కొన్నారు. సావిత్రి భాయి పూలేతోపాటు నాడు బడుగు వర్గాల వారి విద్య కోసం పాటుపడిన మరో మహిళ ఫాతిమా షేక్ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా సావిత్రి భావి పూలే విద్య ఉద్యమానికి సహకరించి తొలి బడి ఆవిర్భావం కోసం నాడు తన ఇంటిని ఇచ్చిన వ్యక్తి ఉస్మాన్ షేక్ అని ఆయన తెలిపారు.  భారతదేశం మొదటి మహిళా  ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నంద్యాల లోని మాసూల్దార్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ సొసైటీ నంద్యాలవారి ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా *జానోజాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాష  మాసూల్దార్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ సొసైటీ ఎస్.ఎం.డీఫారుక్, ఎస్.ఎం.డీ.అబ్దుల్ రహిమాన్, కాంగ్రెస్ నేత అహమద్ హుస్సేన్ మహిళా నాయకురాలు వెంకటలక్ష్మి, మధు యోగేష్, నూరు హుస్సేన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధి పాల్గొన్న జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాష, అబ్దుల్ రెహమాన్ ఫారూఖ్ మాట్లాడుతూ....


భారత దేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా  గుర్తింపు పొందిన సావిత్రిబాయి ఫూలే సామజిక  సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి. బ్రిటిష్ హయాంలో మహిళలు ఇల్లుదాటి బైటకు రావడం పాపంగా భావించే రోజులలో, వారి హక్కుల గురించి ఎవ్వరు పట్టించుకోని సమయంలో  ఆమె మహిళా విద్య కోసం, సామజిక రుగ్మతల నిర్ములన కోసం విశేషంగా కృషిచేసిన మహారాష్ట్రలోని పేరొందిన సామజిక సంస్కర్తలలో ఒకరుగా గుర్తింపు పొందారు.
సంపన్న వ్యవసాయ కుటుంభంలో, వెనుకబడిన సామాజిక వర్గంలో మహారాష్ట్రలోని సతారా జిల్లా నాగన్ లో 1831 జనవరి 3న ఆమె జన్మించారు.   తొమ్మిదేళ్ల వయస్సులోనే 13 ఏళ్ళ జ్యోతిరావుతో ఆమెకు వివాహం జరిగింది.  సనాతన హైందవ గ్రంధాలు  అన్నింటిని చదివిన జ్యోతిరావు *మానవులు అందరికి విద్య అనే సాధనంను సమకూర్చితే అన్ని సామాజిక అసమానతలు తొలగిపోతాయనే నిర్ణయానికి వచ్చారు.ముఖ్యంగా అంటరానితనం వికృత రూపం ఆమెను కదిలించివేసింది కనీసం తమ నీడను సహితం వారు తాకరాదని ఆంక్షలు  విధించడం, ముఖ్యంగా వయస్సుమళ్ళిన భర్తలు చనిపోతే యవ్వనంలోనే మహిళలు అందమైన దుస్తులు, ఆభరణాలు ధరించకుండా, జుట్టు కత్తిరించడం వంటి ఆచారాలకు ఆవేదన చెందారుదానితో 1848లో భార్యాభర్తలు ఇద్దరు కలసి భారత దేశంలో మొదటి బాలికల పాఠశాలను పూణే లోని విశ్రంబాగ్ వాడ వద్ద ప్రారంభించారు. 

 ఈ పాఠశాలలో మొదట్లో కేవలం 9 మంది అన్ని కులాలకు చెందిన బాలికలు మాత్రమే చేరారు. క్రమంగా ఆ సంఖ్య 25కు పెరిగింది. సావిత్రిబాయి ప్రధాన ఉపాధ్యాయురాలిగా పనిచేయగా, ఆమెతో పాటు శిక్షణ పొందిన ఫాతిమా షేక్, జ్యోతిరావు మేనత్త సగుణాబాయి కూడా బోధించేవారు. పూణే లోనే మూడు బాలికల పాఠశాలలను తెరిచారుభారత స్త్రీవాదానికి మాతృమూర్తిగా ఆమెను భావిస్తారు*. కుల, లింగ వివక్షతలకు  వ్యతిరేకంగా అలుపు ఎరుగని పోరాటాలు జరిపారు. ధృడ నిశ్చయంతో ఆమె బాలికల కోసం అనేకచోట్ల విద్యాలయాలు నెలకొల్పారు. చివరకు ఆమె కృషిని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆమెను సత్కరించింది. పూలె దంపతులకు  పిల్లలు లేరు. ఒక బ్రాహ్మణా యువతీ అవాంఛనీయ గర్భం కారణంగా ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం  చేస్తుంటే, ఆమెను కాపాడి, ఆమె పుత్రుడు యశ్వంత్ ను ఈ దంపతులు దత్తత తీసుకున్నారు 1890 లో జ్యోతిరావు ఫులే మరణించిన తరువాత, సావిత్రిబాయి తన పనిని కొనసాగించారు.  ముఖ్యంగా, భర్త  స్థాపించిన సత్య షోధక్ సమాజ్ కార్యకలాపాలపై దృష్టి సారించారు. పుణేలో ప్లేగు బ్యాధి ప్రబలిన సమయంలో ఆమె ప్రతి రోజు 2,000 మంది పిల్లలకు ఆహరం అందించేవారు. ఆమె భారతదేశపు మొదటి మహిళాఉపాధ్యాయురాలు మాత్రమే కాకూండా మొదటి మహిళా కవి కూడా. ఆమె 'కవ్య ఫులే' (1834),  'బవన్కాశీసుబోధ్రత్నాకర్' (1882) అనే రెండు కవితల పుస్తకాలు వ్రాసారు.

 


నాటి సామాజిక సమస్యలను ప్రతిబిమించే ఈ గ్రంధాలు నేటికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయ సావిత్రిబాయి, ఆమె దత్తపుత్రుడు యశ్వంత్, 1897 లో నలసోపారా చుట్టుపక్కల ప్రాంతంలో ప్లేగు బారిన పడిన వారికి చికిత్స చేయడానికి ఒక క్లినిక్ ప్రారంభించారు. ఈ క్లినిక్ పూణే శివార్లలో స్థాపించబడింది. పాండురంగ్ బాబాజీ గైక్వాడ్ కుమారుడిని ఈ వ్యాధి బారి నుండి కాపాడే ప్రయత్నంలో సావిత్రిబాయి వీరోచిత మరణం పొందారు. ముండ్వా వెలుపల మహర్ సెటిల్మెంట్లో గేక్వాడ్ కుమారుడు ప్లేగు బారిన పడ్డాడని తెలుసుకున్న సావిత్రిబాయి ఫులే అక్కడకు వెళ్లి,  అతనిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ ప్రక్రియలో, సావిత్రిబాయి ఫులే ప్లేగు బారిన పడి  1897 మార్చి 10న రాత్రి 9:00 గంటలకు మరణించారు*. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆమె విధవ వివాహాలను  ప్రోత్సహించారు. సావిత్రిభాయి  స్త్రీవాదానికి ఒక కొత్త నిర్వచనం చెప్పారు. భారతీయ మహిళల వికాసం కోసం బలమైన వరవడి సృష్టించారుఅలాంటి త్యాగాలు చేసిన అ మహతల్లిని స్మరించుకుందాం. రేపటి తరానికి తెలియజేద్దాం.అని అన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: