ముస్లిం నగరా ఆధ్వర్యంలో...

భారత రత్న...సరిహద్దు గాంధీ

ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వర్దంతి

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన కిరికెర ఏంజిలో ఐటీఐ ఆవరణలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని 27యేండ్లు జైలు జీవితం గడిపిన శాంతి దూత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కుల మతాలకు జాతులకు ప్రాంతీయ భేధాలకు అతీతంగా మాతృభూమి భారతదేశం బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందటానికి లక్షలాది భారతీయులు ప్రాణాలకు తెగించి తమ సర్వస్వం త్యాగం చేశారని.


ఈ మహనీయుడు చేసిన త్యాగాలకు భారత ప్రభుత్వం భారత రత్న అత్యున్నత పురస్కారం కేటాయించింది దేశ విభజన సమయంలో అఖండ భారతాన్ని కోరుకున్న మహనీయుడు అబ్దుల్ గఫార్ ఖాన్ అని జాతి పిత మహాత్మాగాంధీ సహచరుడి గా ఉంటూ జీవితాంతం అహింసాయుత గాంధేయవాది గా శాంతి కాముకుడు గా శాంతి కోసం అనునిత్యం పరితపిస్తూ తనువు చాలించారని అన్నారు. ఈకార్యక్రమంలో కేర్ సంస్థ థామస్ .క్రిస్టీ.టిప్పు సుల్తాన్ మహిళా సంఘం షమీమె.దేవరాజు.చైతన్య సంస్థ నాగమణి. ఆచారి. జయమ్మ. నయాజ్. లత. జీవరాయుడు. సునీత. సంధ్యా తదితరులు పాల్గొన్నారు.





 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: