ఆవాజ్  కమిటీ రిలే దీక్షలకు...

కాంగ్రెస్ పార్టీ మద్దతు 

మాట్లాడుతున్న నాయకులు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 నంద్యాల ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ బుధవారం  మూడవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్బంగా నంద్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి చింతలయ్య మాట్లాతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెతు వ్యతిరేక బిల్లులు పార్లమెంట్ నందు ఆమెదింపచేయడం, అందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వ్యతిరేకించడం జరుగుతుందన్నారు.

నిన్నటిరోజు విజయవాడలో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర గవర్నర్ ను  కలిసి రైతు బిల్లులకు నిరసనగా మెమొరాండం ఇవ్వడానికి పోతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీస్ లచే బలవంతంగా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అధికార ప్రతినిధి వాసు మాట్లాడుతూ రాష్ట్రములోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడ రైతులకు మద్దతు  ప్రకటించకపోవడం బాధాకరమని అన్నారు. చర్చల పేరిట రైతులను మోసం చేసుతున్నారు తప్ప రైతులకు మేలు చేయడము లేదన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ ప్రసాద్, సెక్రటరీ రహిమాన్,  ఎస్సి సెల్ ఆర్టిసి ప్రసాద్ తదితరులు  పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: