అమ్మఒడికి మళ్లీ అవకాశమివ్వండి

ప్రభుత్వ పథకాలపై సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించండి

ఆర్డీఓకు జానోజానో నేత షేక్ గౌస్ బాషా నాయకత్వం వినతి పత్రం అందజేత

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

అమ్మఒడి పథకానికి అనర్హులు కాబడిన వారికి మళ్లీ దరఖాస్తు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని  “ జానో-జాగో “ ( ముస్లీంల అభివృద్ధి వేదిక  ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కర్త షేక్. గౌస్ బాష డిమాండ్ చేశారు.  ఈ నమోదు ప్రక్రియ విషయంలో అవగాహన కల్పించాలని ముఖ్యంగా సచివాలయ కార్యాలయాలలోని సిబ్బందికి అన్ని రకాల సంక్షేమ పధకాలపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలపై ప్రజలు ఎదుర్కొనే పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్.డి.ఓ. కు  “ జానో-జాగో “ ( ముస్లీంల అభివృద్ధి వేదిక  ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయ కర్త షేక్. గౌస్ బాష నాయకత్వంలో ఆ సంఘం సభ్యులతోపాటు అనర్హులుగా గుర్తించిన విద్యార్ధుల తల్లిదండ్రులు సమర్పించారు. ఈ సందర్భంగా షేక్ గౌస్ బాషా మాట్లాడుతూ ... కొన్ని ప్రభుత్వ సంక్షేమ పధకాలపై అవగాహన లేని కొందరి సచివాలయ సిబ్బంది కారణంగా అన్నీ అర్హతలు వున్నా “ అమ్మఒడి” పధకానికి నోచుకోని దిగువ, మధ్య తరగతి కుటుంబాలలోని తల్లిదండ్రుల ఆవేదన చెందుతున్నారు. 2020-2021వ విద్యా సంవత్సరానికి సంబంధించి అన్నీ అర్హతలు వుండి “ అమ్మఒడి” పధకానికి నమోదు చేసుకున్నా, ముఖ్యంగా కొంతమందికి సాధికార సర్వే ప్రక్రియ నిలిపివేసిన కారణంగా దిగువ మధ్య తరగతి కుటుంబాలలోని తల్లిదండ్రులకు చాలవరకు నిరాశే మిగిల్చింది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాల వలన నమోదు చేసుకున్న వారిలో కూడ కొంతమందిని దాదాపు 30% అనర్హులుగా గుర్తించడం జరిగింది. అనర్హులతో పాటు అర్హులైన వారిలో కొందరూ, మార్పులతో నమోదు చేసుకున్న కొందరిని అనర్హులుగా గుర్తించడంతో చాలామంది ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వపరంగా అనర్హులందరికి అనర్హతలకు గల కారణాలు తెలుపుతూ   సరైన దృవీకరణ పత్రాల ద్వారా సంబంధించిన సచివాలయ కార్యాలయాలలో సరిచేసుకునే విథంగా, కేవలం రెండు రోజుల వ్యవధితో అవకాశం కల్పించారు, ఎంతో ఆశతో అన్ని రకాల దృవీకరణ పత్రాలు తీసుకొని సచివాలయ కార్యాలయాలకు పరుగులు తీసిన తల్లిదండ్రులకు “ మాకు దీని గురించి ఏ విధమైనటువంటి అవగాహన కల్పించకుండా, మా దగ్గరకి పంపిస్తే మేము మీకు ఏ విధంగా న్యాయం చేయగలమని సచివాలయ సిబ్బంది వాపోతున్నారని తెలియచేశారు. ఇటు సంబంధించిన పాఠశాలలోను, అటు సచివాలయ కార్యాలయాలలోనూ సరిచేసే అవకాశం లేని కారణంగా, చదువు లేని తల్లిదండ్రులతో పాటు విద్యాపరంగా అవగాహన కలిగిన వారు కూడ ఏంచేయాలో తెలియక,  వారి సమయాన్ని వృధా చేసుకుంటూ తిరుగుతున్నారని. ఆయన తెలిపారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: