ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి చేతుల మీదగా...
క్యాలెండర్ ఆవిష్కరణ
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ఏ1 గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత షంషీర్ అలి బేగ్, ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యములో క్యాలెండర్... డైరి అవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మార్కాపురం నియోజకవర్గ శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానించిన షంషీర్ అలీబేగ్ తీరును చూస్తుంటే చాల గర్వంగా వుందన్నారు.
బేగ్ కొందరివారిలాగా కాకుండ, అందరివారిలా కనిపిస్తున్నారని, ఇలాగే అందరిదగ్గర మంచి పేరు ప్రఖ్యాతులు గడుస్తున్న షంషీర్ అలీబేగ్ ను ఎమ్మెల్యే ప్రశంసించారు. ఇదే సందర్భములో ఎం.ఎల్.ఎ. చేతుల మీదుగా. క్యాలెండ, డైరీ అవిష్కరణ జరిగింది. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్యాలెండర్, డైరీ అందచేశారు. ఈ కార్యక్రమములో మార్కాపురం పట్టణ వై.సి.పి. అధ్యక్షులు బాల మురళీక్రిష్ణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి.మోహన్ రెడ్డి, మహబూబ్ సుభాని (బాష), ప్రకాష్, తదితరులతోపాటు పట్టణ మరియు తర్లుపాడు మండలములోని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేఖరులు పాల్గోన్నారు.
ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డి
గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత మీర్జా షంషీర్ అలీబేగ్
Post A Comment:
0 comments: