ఏ.పి.ఐ.ఎస్.ఎ.పి. కింద చెరువు సమగ్ర అభివృద్ధి
ఇరిగేషన్ అసిస్టంట్ ఇంజనీరు వెంకటరమణమ్మ
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామము నందు ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు మరియు వ్యవసాయ పరివర్తన పధకం క్రింద ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్ధ ఆధ్వర్యములో సాగునీటి సంఘ విధులు, బాధ్యతలపై శిక్షణా కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము నందు ఇరిగేషన్ అసిస్టంట్ ఇంజనీరు వెంకటరమణమ్మ మాట్లాడుతూ ఏ.పి.ఐ.ఎస్.ఎ.పి. క్రింద చెరువు సమగ్ర అభివృద్ధి చేయుట జరుగుతుందని, తుమ్మలచెరువు గ్రామములోని చెరువు నందు కట్ట బలపడటం, అడుగు తూమును సాగునీట కాలువ మొదలైన పనులు పూర్తయినట్లు జరిగిందని, దాదాపుగా 90% పూర్తవడం జరిగిందని, మొత్తం ఈ చెరువు ఎదుగుదల కొరకు 70,000,00 లక్షల రూపాయాలు మంజూరు అయిందని 90 శాతం పనులు పూర్తవడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమము నందు ఎఫర్ట్ ఎ.పి.ఐ.ఐ.టి.పి. టీమ్ లీడర్ సుధాకర్ మాట్లాడుతూ ఈ పధకం నందు ఇరిగేషన్, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, భూగర్భ జల శాఖ మరియు మత్స్య శాఖలను సమన్మయం చేసుకొని ఈ పధకంలోని కార్యక్రమాలు జరుగుతాయని, రైతులందరూ ఈ కార్యక్రమమును అవగాహన చేసుకొని సద్వినియోగపరచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమము నందు సచివాలయ సిబ్బంది, విఎఎ భోపాల్ గారు, ఫిషరిస్ అసిస్టెంట్ శ్రీనివాస రెడ్డి, కో ఆర్డినేటర్ నారాయణ రెడ్డి, సిఓ-ఎస్ఎపి కిరణ్ కుమార్ గారు మరియు రైతులు పాల్గోనడం జరిగింది.
Post A Comment:
0 comments: