వినతిదారుల వినతుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తా
సబ్ కలెక్టర్ కల్పనా కుమారి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
వినతిదారుల వినతుల సమస్యలను సత్వరమే పరిష్కరించుతామని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిదారుల నుండి సబ్ కలెక్టర్ కల్పనా కుమారి వినతులను స్వీకరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కార్యక్రమం ఫిబ్రవరి ఒకటో తారీకు నుండి అమల్లోకి వస్తుందన్నారు. ఈ రేషన్ పంపిణీ విషయంపై రెవిన్యూ శాఖ పర్యవేక్షిస్తామన్నారు.
ఈరోజు అందిన వినతులలో భూ సమస్యలను గురించి భూములను అక్రమించుకుంటున్నారని, మాకు పాస్ బుక్కులు లేవని, పాస్ బుక్కులు ఇప్పించాలని, మాకు పింఛన్లు ఇపించాలని, కుటుంబ తగాధలకు సంబంధించి వినతులు అందాయన్నారు. దాదాపుగా 12 అర్జీలు అందినాయన్నారు.
Post A Comment:
0 comments: