వైద్యులు, వకీళ్ళ పై కేసులు నమోదు చేయరాదు

సుప్రీం కోర్టు సంచలన తీర్పు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కేసుల విచారణ ప్రక్రియ పూర్తి చేసేందుకు వకీళ్లు శాయశక్తులా కృషి చేస్తారని, ఒకవేళ శిక్ష ఖరారైన సందర్భంలో వారి తప్పు ఏముంటుందని, వారిపై 420 ఐ పి ఎస్ కింద కేసు నమోదు చేయరాదని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జస్టిస్ తరుణ్ గోగాయి నేతృత్వంలో ఏర్పాటైన ధర్మాసనం  ఇచ్చిన తీర్పులో  ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.. క్లయింట్ తరఫున తమ వృత్తి ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారని తెలిపారు. వారిపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకూడదని ధర్మాసనం పేర్కొంది. పోలీసులకు, కోర్టుకు వారధిగా న్యాయం కోసం సాక్షులను వకీల్లు ప్రశ్నిస్తారు తప్ప నష్టం చేసేందుకు ఎవ్వరూ ఉపక్రమించే అవకాశం లేదని తీర్పులో పేర్కొన్నారు.

ఫీజులు వసూలు చేసి కేసు ఓటమికి బాధ్యుడు అయ్యాడనే అపవాదును మూటకట్టుకొంటున్నారని, భవిష్యత్తులో వారిపై ఎలాంటి నిందలు, అపనిందలు మోపే ఆస్కారం ఉండకూడదు అని అన్నారు. కేసు విచారణ ప్రక్రియ గురించి ఖచ్చితమైన హామీ ఇచ్చే అవకాశం ఉండదని, ప్రయత్నించే క్రమంలో ఏమి జరిగినా వారి నీ తప్పు చేసిన వారీగా కేసులు నమోదు చేయకూడదు అని అన్నారు. అదేవిధంగా వైద్యులు సైతం తమవంతు పాత్ర పోషించే వ్యక్తి గా కృషి చేస్తారని తెలిపారు. శస్త్ర చికిత్స చేసే ప్రక్రియలో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తారని, అదే సమయంలో అనుకోని సంఘటనలు జరిగినా వారి తప్పిదం కాదనే విషయాన్ని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయ వాదులు, వైద్యులు వారి వారీ వృత్తి ధర్మాన్ని అనుసరించి పని చేస్తారు అని అన్నారు. వృత్తి ధర్మంలో ఎలాంటి సంఘట నలు  చోటు చేసుకున్నా అందుకు వారిని బాధ్యులుగా చిత్రిక రించడం సమంజసం కాదని గమనించాలని కోరారు.

రిపోర్టింగ్--డి. అనంత రఘు

 వకీలు....సీనియర్ జర్నలిస్ట్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: