గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (జిఐవో)  శాఖ...

ఆధ్వర్యంలో న్యూ ఇయర్ డైరీ..క్యాలెండర్ పంపిణీ


(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (జిఐవో)  శాఖ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలువురు మహిళా అధికారులను, నాయకులను కలిసి ఇంగ్లీష్ న్యూ ఇయర్ డైరీ, క్యాలెండర్ ను అందిస్తున్నారు. చార్మినార్ శాఖ జీఐవో అధ్యక్షురాలు రయ్యాన్ అష్రఫ్ తన బృందంతో కలిసి గత వారం రోజులుగా పాతబస్తీలోని పలువురు విద్యావేత్తలు, మహిళా అధికారులు,, కార్పోరేటర్లకు డైరీలు, న్యూ ఇయర్ కేలండర్లను అందించి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అందించారు. సౌత్ జోన్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ సీఐ మధులత, తలాబ్ కట్టా కార్పోరేటర్ నస్రీన్ సుల్తానా, సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయలక్ష్మి, మహిళా లాయర్లు, డాక్టర్లను కలిశారు.

జీఐవో సంస్థ చేపట్టే కార్యక్రమాలను ప్రముఖులకు వివరిస్తున్నారు. కాలేజీల్లో, స్కూళ్లల్లో అమ్మాయిల్లో నైతిక విప్లవం తీసుకువస్తున్నారు జీఐవో కార్యకర్తలు. సిగ్గు, బిడియాలే తమకు ఆభరణాలని నైతిక ఎంపికలకు మార్గదర్శకంగా నిలుస్తున్న జీఐవో బాలికలు నిజంగా అభినందనీయులని పలువురు ప్రశంసిస్తున్నారు. ‘మంచి వ్యక్తిత్వానికి మించిన సౌందర్యం మరొకటి లేదని, ధార్మిక కట్టుబాట్లలో ఉంటూ విద్యా, ఉపాధి రంగాల్లో రాణించవచ్చని నిరూపిస్తున్నాము‘ అంటారు చార్మినార్ శాఖ జీఐవో అధ్యక్షురాలు రయ్యాన్ అష్రఫ్. ‘తల్లి తండ్రికంటే మూడు రెట్లు ఎక్కువ హక్కుదారని ప్రవక్త (స) చెప్పిన ఈ మాట మహిళలకు సమానత్వం చాలదనే సందేశం ఇందులో నిగూడార్థంగా ఉంది’ అంటారు రయ్యాన్ అష్రఫ్, ఖన్సా తబస్సుమ్. 

✍️రిపోర్టింగ్-ముహమ్మద్ ముజాహిద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: