విజయవంతంగా రైతు జాతా
టి.సాగర్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
గత ఎనిమిది రోజులుగా రైతు జాతా విజయవంతంగా సాగుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ఆయన ఇలా పేర్కొన్నారు. జనవరి 1న సంగారెడ్డిలో ప్రారంభమైన రైతుజాతా 8 రోజులుగా విజయవంతంగా జరుగుతున్నది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల,నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో యాత్ర పూర్తయింది. ఇప్పటి వరకు 70 సభలు జరిగాయి. 15,000 మంది ఈ సభల్లో పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలపై కళాకారులు పాడిన పాటలు ప్రజలను బాగా ఆలోచింపచేస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న రైతులపోరాటంలో భాగస్వాముల మవుతామని ప్రజలు స్వచ్చందంగా ప్రకటిస్తున్నారు. రైతులతోపాటు అనేక రంగాల కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, మేధావులు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇంకాకొనసాగుతున్న రైతు జాతాలో ప్రజాలందరు భాగస్వాములు కావాలని కోరుతున్నాము.
జనవరి 9,10 తేదీల్లో గ్రామాల్లో ఆందోళనలు
జనవరి 9,-10 తేదీల్లో గ్రామాల్లో దీక్షలు, సభలు, ప్రదర్శన రూపాల్లో రైతు వ్యతిరేక చట్టాలపై నిరసన కార్యక్రమాలు చేయాలని. కార్పొరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, సి2+50 శాతం కలిపి కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 9-10 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో దీక్షలు, సభలు, ప్రదర్శనలు నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం కోరుతున్నది.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దీక్షలు, ప్రదర్శనలు, సభలు నిర్వహించాలి. రాష్ట్రంలోని దాదాపు 5000ల గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గ్రామ, మండల, జిల్లా కమిటీలు కృషి చేయాలి. రైతులను, వసాయాన్ని, గ్రామాలను కార్పొరేట్ చేతుల నుండి రక్షించడానికి, దేశం యొక్క ఆహార భద్రత మరియు స్వావలంబనను కాపాడటానికి పోరాటాన్ని కొనసాగించాలని. ఆయన పిలుపునిచ్చారు.
Post A Comment:
0 comments: