భారత గణతంత్ర పర్వం మానవజాతికి గర్వం 

అంతర్జాతీయ చిత్రకారులు  రుస్తుం 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్బ్యూరో)

గణతంత్ర దినోత్సవ జంఢా పండుగాను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ లో సోమవారం ఇండియన్ యూనిటీ, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, చిత్రాలను ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 'భారత దేశ, గణతంత్ర పర్వం' భారత జాతికి గర్వం' ఆనందాలే సర్వం. భారత జాతి దాస్య శృంఖలాలను  ఎందరో త్యాగదనుల పుణ్యఫలం మనం అనుభవించే భారత స్వాతంత్య్రం. కల్పించిన లౌకిక భారత రాజ్యాంగం, ప్రతి పౌరుడు కాపాడుకోవాల్సిన అస్తిత్వ భాధ్యత. బీ ఆర్ అంబేడ్కర్ రచించిన భారతదేశ రాజ్యాంగం, మానవజాతి కే గర్వకారణం ప్రపంచానికి మార్గదర్శనం. మానవీయ పరిరక్షణ మహా రక్షణకవచం మన రాజ్యాంగం.

అందరికి శాంతి భద్రతలు సుఖ సంతోషాలు సహజీవనం సౌబ్రాతృత్వం ఆచరణలో సఫలీకృతం కావాలని, ఇంకా స్వతంత్ర ఫలాలు అందని అభాగ్యులకు హక్కులు అందాలని, కరోనాను అధిగమించి అందరూ ఆనందంగా వుండాలని, అంబరం చుంబినా మువ్వన్నెల జెండా సంబురం భారతజాతి గుండెల్లోపదిలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మానవతా చిత్రకారులు రుస్తుం అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం నేచర్ ఆర్టిస్ట్ రూబీనారుస్తుం, మైనారిటీ నేత అబ్దుల్ ముస్తఫా, మెహరాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: