ఓటరు జాబితా ను పరిశీలించిన..

ఎన్నికల రోల్ అబ్జర్వర్ శోభ(ఐఎఎస్)

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఎన్నికల రోల్ అబ్జర్వర్ శోభ ఐఏఎస్ ఓటర్ల జాబితాను పరిశీలించారు. సోమవారం నంద్యాల తహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రోల్ అబ్జర్వర్  శోభ ఐఏఎస్,  నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్  నిధి మీనా, ఇఆర్ఓ అనురాధలతో కలిసి ఓటర్ జాబితా ను పరిశీలించారు. అనంతరం ఎన్నికల రోల్ అబ్జర్వర్ శోభ ఐఏఎస్( గిరిజన కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్) మాట్లాడుతూ ఈరోజు నంద్యాల తాసిల్దార్ కార్యాలయంలో నంద్యాల నియోజకవర్గం (139)లోని ఓటర్ల జాబితాను పరిశీలించడం జరిగిందని, అలాగే ఫారం 6.7.8.8a తదితర ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు వాటిని కూడా పరిశీలించామని, అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని ఆమె అన్నారు.

ఓటర్ల తుది జాబితా ఈనెల 15వ తారీఖున వెలువడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల తహసిల్దార్ రవికుమార్, ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ రామ్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: