కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం 

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని నంద్యాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీచౌక్ నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసి మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేయడం జరిగిందని నంద్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి చింతలయ్య  తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య మాట్లాడుతూ  భారత దేశంలో ఇప్పుడు పరిపాలన చేస్తున బిజెపి ప్రభుత్వం 2020సంవత్సరంలో సంభవించిన కరోనా మహమ్మారి వలన పేద వారు పేదవారి గానే మిగిలిపోవడం జరిగిందని, అనేక కష్టాల అనుభవించారని, ధనవంతులు మరీ ధనవంతులుగా మిగిలిపోయారని వారు ఆరోపించారు.
ఈ ప్రభుత్వంలో పెద్ద పెద్ద కంపెనీలు లాభపడడము జరిగిందన్నారు. పీసీసీ జనరల్ సెక్రటరీ చింతల మోహన్ రావు మాట్లాడుతూ భారత దేశంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ హయాంలో సుఖసంతోషాలతో ఉన్నారని, నేటి ప్రభుత్వలు ప్రజలను మోసం చేస్తూ ప్రజల మీద పన్నుల భారం మోపుతూ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి ఉకోటు వాసు, సీనియర్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లగ్గి శెట్టి సుబ్బ గురుమూర్తి, సేవా దళ్ సెక్రటరీ మస్తాన్, ట్రెజరర్ ప్రసాద్, రెడ్డి ఉసేని సలాం ఖాసీం అజయ్ మహిళా నాయకులు ఉమయాదవ్ మహిళలు మొదలగు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: