దిగజారి మాట్లాడుతూన్న పవన్ కళ్యాణ్

రెండు చోట్ల తిరస్కరణకు గురవయ్యావు

ఇక అన్నాను ఏమి ఓడించగలవు

రాష్ట్ర వైసీపీ నేత డాక్టర్ ఏలూరి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

పార్టీ అధ్యక్షుడి హోదాలో రెండు అసెంబ్లీ నియోజవర్గాలలో పోటీచేసి ప్రజల నుండి తిరస్కరణకు గురైన మీరు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో రెండవ స్థానంలో గెలిచిన ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఎలా ఓడిస్తావని, ఆ శక్తి నీకు ఎంత మాత్రం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పలు ప్రశ్నలు సంథిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను దెప్పి పొడిచారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఓడిస్తామని నేడు పవన్ కల్యాణ్ ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొనడంపై డాక్టర్ ఏలూరి పై విధంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాంబాబుపై వ్యక్తి గత కక్ష్యతో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు వుంది తప్ప ఒక పార్టీ అధినేత స్థాయిలో చెప్పినట్లు లేదని విమర్శించారు.  82 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలుపొందారంటే రాంబాబు పై ఆ నియోజకవర్గంలో ఆయన నాయకత్వం పట్ల ప్రజల్లో ఎంత అచంచలమైన విశ్వాసం వుందో స్పష్టంగా అర్ధమవుతుందని, ఇంతకన్న నిదర్శనం మరొకటి ఏముంటుందని అన్నారు. మతిస్థిమితం కోల్పోయి మృతి చెందిన సంఘటనను రాజకీయం చేసి, ఎంతో ప్రజాధారణతో ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే అన్నాను అప్రదిష్టపాలు చేసే విధంగా జనసేన నాయకులు వ్యహరించడం సిగ్గుచేటని విమర్శించారు. అయినా గిద్దలూరు నియోజకవర్గ వర్గ ప్రజలు ఎంతో విజ్ఞులని, పరిణితి చెందిన వారని,అందువల్ల ప్రజలతో ఏ మాత్రం సంబంధము లేని వారు చెప్పే మాటలను ఏ మాత్రం విశ్వసించరని అన్నారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా నీతి, నిజాయితీకి మారుపేరుగా వున్న ఎమ్మెల్యే రాంబాబుకు నిరంతరం తోడు,నిండగా వుంటూ ముందుకు నదిపిస్తారని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి భరోసాతో అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: