ఆ జీఓలను ఉప సంహరించుకోవాల్సిందే
ఇంటి పన్నుల పెంపుపై పట్టణ పౌర సమైక్య ఆధ్వర్యంలో నిరసనలు
పాల్గొన్న ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నుల పెంపును ఉపసంహరించుకోవాలని, 196,197,198 జివోలు రద్దు చేయాలని కోరుతూ పట్టణ పౌర సమైక్య ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయం నందు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్ష్య, కార్యదర్శి పీ. శివరామయ్య, జే.ఎస్.ఆర్. క్రిష్ణ శాస్త్రీ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఉపాధి లేక ఆదాయవనరులు తగ్గిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పన్నుల భారం గుదిబండ మారన్నునది అన్నారు. ఆస్తిపన్ను పెంపు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మంచి నీటి పన్ను డ్రైనేజీ పనులు పెంచడానికి ఇచ్చిన జీవోలు 196, 197, 198 లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అద్దె ఆధారంగా పన్నులు కాకుండా ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు.
ఈ ప్రకారం పన్ను వలన 10 నుండి 15 రెట్లు పన్నులు పెరుగుతుందని అన్నారు. ప్రస్తుతం కరోనాతో ఉపాధి కోల్పోయి పని లేక ఆదాయవనరులు తగ్గిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పన్నుల భారం గుదిబండ మారన్నునది అన్నారు. 2020-2021,2021-2022 ఆర్థిక సంవత్సరానికి 50 శాతం పన్ను రాయితీ కల్పించాలని, స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బకాయిలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎం పి జె రాష్ట్ర కోశాధికారి ఎస్కే రజాక్, ఐఓఎం నాయకులు పీ.అయ్యుబ్ ఖాన్, ఐయూఎం నాయకులు ఎస్.కె.ఇస్మాయిల్, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు టీ.సత్యనారాయణ,రిటైర్డ్ ఉద్యోగులు కేశవరావు, ఎన్.వెంకట రెడ్డి, కె.వీరయ్య, వై. వెంకట సుబ్బయ్య, డివైఎఫ్ఐ నాయకులు యేనుగుల. సురేష్ కుమార్, ఎస్.కె.జబ్బర్,రైస్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు వెంకట సుబ్బయ్య, సీఐటీయూ నాయకులు డి.కె.ఎం.రఫీ, డి. సోమయ్య, పి. రూబెన్, కెవిపిఎస్ నాయకులు జె.రాజు, కె. నగేష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానోజాగో వెబ్ న్యూస్
ప్రకాశం, గుంటూరు జిల్లాల బ్యూరో ఇన్ ఛార్జ్
Post A Comment:
0 comments: