కృష్ణానది జలాల యాజమాన్య బోర్డును కర్నూల్ లోనే ఏర్పాటు చేయాలి
అఖిలపక్ష రాజకీయ పార్టీల డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
కృష్ణానది జలాల యాజమాన్యం బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రము ఇవ్వడం జరిగిందని సిపిఐ. జిల్లా కార్యవర్గ సభ్యులు బాబా ఫక్రుద్దీన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాజశేఖర్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం శంకర్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. కార్యదర్శులు సోమన్న, నరసింహులు, సిపిఐ సీనియర్ నాయకుడు శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సుబ్బరాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏసోబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణానది జలాల యాజమాన్య బోర్డును హైదరాబాద్ నుండి తరలించి విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొనడం విచారకరమన్నారు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు వెనుక భాగం నుండి రాయలసీమ, దక్షిణాంధ్ర జిల్లాలో ప్రవహిస్తున్నాయని, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు కర్నూలు జిల్లాలోని రైతులు లక్షల ఎకరాలు భూమి త్యాగం చేశారన్నారు.
Post A Comment:
0 comments: