కస్టడీ కి పిటీషన్ దాఖలు చేసిన పోలీసులు 

వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వండి


(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కిడ్నాప్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ ప్రక్రియ ను చేపట్టేందుకు వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. సికింద్రాబాద్ లోని కోర్టులో పోలీసులు పిటీషన్ ను దాఖలు చేశారు.  ప్రస్తుతం చంచల్ గూడా మహిళా జైలు  జుడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియ ను విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి ఇచ్చినట్లయితే కిడ్నాప్ కేసు కు సంబంధిన వివరాలను సేకరించేందుకు వీలుంటుందని పేర్కొంది. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ 167(3) సి ఆర్ పి సి కింద పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. రిమాండ్ సమయానికి విచారణ ప్రక్రియ పూర్తి కాలేదని, కస్టడీ సమయంలో ఆధారాలను సేకరిస్తామని పోలీసులు తెలిపారు.  "" సీన్ ఆఫ్ ఆఫెన్స్ "" రీ కన్ స్ట్రక్  చేయనున్నట్లు వివరించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరించాల్సి ఉంటుంది అని పోలీసులు తెలిపారు. అదేవిధంగా సాక్షాదారాలను నమోదు చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. సాక్షుల వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత కోర్టుకు హాజరు పరుస్తామని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు తీర్పు ను సోమవారానికి వాయిదా వేసింది. భూ వివాదం కేసులో కావల్సిన దృవీకరణ పత్రాల ను సేకరించి, సాక్షుల వాంగ్మూలం నమోదు చేసి విచారణ ప్రక్రియ ను పూర్తి చేసేందుకు పోలీసు కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. ఎవరెవరికి ఈ కేసుతో సంబంధం ఉందో వారిని సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని తెలిపారు. పరారీలో ఉన్న వారి వివరాలు, ఎక్కడ తలదాచుకున్నారు అన్న అంశాల గురించి లోతుగా అధ్యయనం చేసే దిశగా విలౌతుందని అన్నారు. అప్పటివరకు నిందితులకు బెయిల్ మంజూరు చేయకూడదని పేర్కొన్నారు. 

ఇదిలావుంటే భూమా నాగిరెడ్డి కుటుంబం తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంభానికి చాలా సన్నిహితంగా ఉంటుందన్న విషయం విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బంధువు అయిన ప్రవీణ్ రావు సదరు భూమిని ఓ సంస్థకు ధారాదత్తం చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.  ఆ సంస్థ అధినేత తెర వెనుక ఉండి ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత భూ వివాదం కొత్త పుంతలు తొక్కుతోంది అని తెలుస్తోంది. ఏపి మాజీ మంత్రి అఖిల ప్రియ కు బెయిల్ మంజూరు కాకుండా అడ్డుకట్ట వేయడానికి కుట్ర జరుగుతోందని ఓ వర్గం విమర్శిస్తోంది.

✍️ రిపోర్టింగ్ -డి. అనంత రఘు

అడ్వకేట్ -హైద్రాబాద్.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: