"మనం" ప్రతికా క్యాలెండర్ ను

ఆవిష్కరించిన పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి 

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

"మనం" ప్రతికా క్యాలెండర్ ను పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఆదివారం నాడు పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి   స్వగృహంలో  మనం  దిన పత్రిక విలేకరులతో కలిసి మనం దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
 పత్రిక రంగం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేస్తుందని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు  ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పత్రికలు ప్రశ్నిస్తూ ఉంటాయని అంతేకాకుండా విద్యార్థులకు మేధస్సు పెంచేందుకు చట్టాల పట్ల ప్రభుత్వం పట్ల పరిపాలన పట్ల అవగాహన కల్పిస్తాయి అని తెలిపారు . ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్ చదవడం వల్ల విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు మనం పత్రిక అనతికాలంలోనే ప్రజాభిమానాన్ని పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కోటి, దాసు, పకీరప్ప, గణపతి మరియు స్థానిక విలేకరులు, పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి  సేవాదల్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: