"సినిమాలే లైఫ్ రా మామా"

అంటున్న 'చైతన్య రాపేటి'

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

     2021లో మన టాలీవుడ్ లో మరో టాలెంటెడ్ యువకుడు 'దర్శకుడు' కానున్నాడు. పేరు 'చైతన్య రాపేటి. "సెల్ఫీ సాక్షిగా, వీకెండ్ పార్టీ, రీ-బర్త్, కాలింగ్ బెల్, మంచి కాఫీలాంటి పెళ్లి చూపులు" అనే షార్ట్ ఫిల్మ్స్ తో ఇప్పటికే తన ప్రతిభను ఘనంగా నిరూపించుకున్న ఈ వైజాగ్ కుర్రాడు... తాజాగా "సినిమాలే లైఫ్ రా మామ" పేరుతో మరో లఘు చిత్రం రూపొందించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లోనే కాకుండా... సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది!


 

     "ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారు?, 47 డేస్" చిత్రాలతోపాటు... త్వరలో విడుదల కానున్న "అక్షర" చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన చైతన్య రాపేటి ఇంజినీరింగ్ లో పట్టభద్రుడు కావడంతోపాటు..

డైరెక్షన్ లో డిప్లొమా చేసి ఉండడం విశేషం!

     లో బడ్జెట్/మీడియం బడ్జెట్ లో తెరకెక్కించడానికి వీలయ్యే కొన్ని కథలు తన వద్ద ఉన్నాయని, ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ కోసం ప్రయత్నిస్తున్నానని చెబుతున్న చైతన్య... తన తాజా షార్ట్ ఫిల్మ్ "సినిమాలే లైఫ్ రా మామ"తో తన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయనే నమ్మకం ఉందని అంటున్నాడు!!


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: