శివాజీ స్థాపించదల్చింది...హిందూ రాజ్యమా...?

వర్ణ వివక్షరహిత సామ్రాజ్యమా...?

శివాజీకి తల్లి జిజియా బాయి నేర్పిన ఆదర్శలేమిటో తెలుసా...?

శూద్ర, అతిశూద్రులకు ఆయుధ నిరాకరణ ఉన్న రోజుల్లో ఆమె కత్తి చేతబట్టింది. బ్రాహ్మణ ధర్మమైన మనుస్మృతిని ఎదిరించి, ఛత్రపతి శివాజీని చక్రవర్తిని చేసింది. సమస్త భారత దేశ మహిళలకు విదేశీ బ్రాహ్మణుల ద్వారా రాయబడ్డ మనుస్మృతి గులాంగిరి నుండి విముక్తిని అందించింది. ఆమె రాజమాత జిజియాబాయి. ఛత్రపతి శివాజీ తల్లి జిజియా బాయి. 

"ప్రతి దేశద్రోహినీ వేటాడు ,ప్రతి దేశభక్తుణ్ణి పూజించు ,స్త్రీలను గౌరవించు" అంటూ రాజమాత జిజియా బాయి తన తనయుడు శివాజీను మహారాష్ట్రలో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు బాల్యం నుంచే విలువలను, దేశభక్తిని నూరిపోసి పెంచింది. జిజియాబాయి జనవరి 12 ,1598లో జన్మించినారు. జిజియాబాయి భర్త షహాజీ బోంస్లే. రాజమాత జిజియాబాయి గురించి, ఛత్రపతి శివాజీ గురించి చరిత్రలో మతోన్మాదులు కాషాయం రంగు పులిమి హిందూరాజ్యం కోసం పనిచేసినట్లు వక్రీకరణ చేసి అసలు చరిత్రను చెప్పకుండా తప్పుడు వ్రాతలతో సమాజాన్ని ద్వేష భావనవైపు నడిపిస్తోన్నారు.

వాస్తవానికి మాతా జిజియాబాయి ఏనాడూ ఏ మతం మీద ద్వేషం కానీ ఒక మతం ఆధారంగా రాజ్యాన్ని నిర్మించమని కానీ తన తనయుడు శివాజీ కు బోధించ లేదు. జిజియాబాయి కరుణ గల హృదయం గల స్త్రీ. భావి మరాఠా సామ్రాజ్యాన్ని మానవత్వంతో విలువలతో సమతా రాజ్యం వైపు నడిపించాలని కలలు కన్నది. ఆమె ఏనాడూ హిందూ రాజ్యం స్థాపించడానికి తన తనయుణ్ణి పెంచలేదు. ముస్లిములపై ద్వేషాన్ని తన తనయుడికి నూరిపోయలేదు. కొందరు పనిగట్టుకుని అసలు చరిత్రను వాళ్ళ ఆధిపత్యం మెజారిటీ ప్రజల మీద రుద్ధడానికి హిందూ రాజ్యం స్థాపనకు జిజియాబాయి, శివాజీ లు కృషి చేశారని వక్రీకరణ చేసి అదే పనిగా సోషల్ మీడియా లో పోస్టులు పెడుతుంటే అసలు చరిత్ర తెలియకుండా చాలా మంది అదే నిజమని నమ్మి ఆ ద్వేష పూరిత పోస్టులు కాపీ చేసి ,షేర్ చేయడం శోచనీయం.

శివాజీని చక్రవర్తి చేయడానికి తల్లిగా జిజియాబాయి రాజ్యం అంతా పర్యటించి రాజ్యంలో ఆనాటి వర్ణ వ్యవస్థ వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించారు. ప్రజల కష్టాలను తొలగించడానికి కృషి చేశారు. శివాజీ ను మంచి ఆదర్శ చక్రవర్తిగా తీర్చిదిద్దిన గొప్ప ఆదర్శ మాతృమూర్తి జిజియాబాయి. ఆనాటి బ్రాహ్మణులు ఒక శూద్రుడు రాజ్యపాలన చేయడం సహించలేక పోయారు. మనుధర్మశాస్త్రం ప్రకారం శూద్రులు రాజ్యపాలన చేయరాదు. శూద్రులు, మహిళలు చదువుకోరాదు. కేవలం సేవకులు గా ఉండాలి అని మనుధర్మశాస్త్రం చెబుతోంది. అలాంటిది శూద్ర కులానికి చెందిన అందులోనూ ఒక మహిళ రాజమాత గా తన తనయుణ్ణి రాజు చేయాలని చూడటం ఆ రోజుల్లో గొప్ప సాహసమే. అందుకే ఆనాటి పురోహితులు శివాజీ కు పట్టాభిషేకం చేయడానికి ముందుకు రాకపోవడంతో పక్క రాజ్యం నుంచి గంగంభట్టు అనే బ్రాహ్మణుడిని తీసుకుని వస్తారు. బ్రాహ్మణ ధర్మం ఎక్కడా శూద్రులను గౌరవించదు. అందుకే నాడు శివాజీ పట్టాభిషేకం సమయంలో ఎడమ కాలి బొటన వ్రేలితో శివాజీ నుదుటిన తిలకం పెట్టి నాటి బ్రాహ్మణ మనువాదులు శూద్ర శివాజీ ను అవమానం చేసారు. ఇది చాలా దుర్మార్గం. ఇలాంటి హిందూ అసమానతలపై శివాజీ, అతని తరువాత వచ్చిన వారసులు పోరాటం చేశారు. జూన్ 17,1674 లో జిజియా బాయి నిర్యాణం చెందారు.

✍️ రచయిత-కె.అర్.హరిప్రసాద్ బహుజన్


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: