వైషమ్యాలు రెచ్చగొట్టేందుకే పవన్ పర్యటన
ఎమ్మెల్యే అన్నాను విమర్శించే హక్కు ఎవరికి లేదు
రాష్ట్ర వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో వైషమ్యాలు రెచ్చగొట్టేందుకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటనకు వస్తున్నారని, ఇలాంటి టూర్ లు మంచిది కాదని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విమర్శించారు. బేస్తవారిపేట మండలం సింగరపల్లి గ్రామంలో మతిస్థిమితం కోల్పోయి మృతి చెందిన వెంగయ్య సంఘటన ను రాజకీయం చేయడమే గాక ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆయన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నిందా ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.
ప్రజా సమూహం మధ్యన నిరంతరం తిరుగుతూ మరోవైపు నీతి నిజాయితీకి మారుపేరుగా పేరు ప్రఖ్యాతులు కలిగిన అన్నా రాంబాబును విమర్శించే హక్కు ఎవరికి లేదని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.
Post A Comment:
0 comments: