అక్రమ అరెస్టులు సరికాదు

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శ

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం లోని దోర్నాల బస్టాండ్ సెంటర్ వద్ద గల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను నిరసనగా మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. మొదటగా దోర్నాల బస్టాండ్ సెంటర్ వద్ద గల అన్న నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాల సమర్పించి ర్యాలీగా గడియార స్తంభం సెంటర్ వద్ద గల జాతిపిత క్రి"శే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ

 20 నెలల వైసీపీ పాలనలో వెనుకబడిన బలహీన మైనారిటీ, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిన వారిపై అక్రమ కేసులు అన్యాయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బనాఇస్తుందని తెలిపారు. వారు మాట్లాడుతూ ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ప్రజలకు మంచి పాలన అందించాలని, బడుగు బలహీన వర్గాల పై దాడులు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు వైఎస్ఆర్సిపి నాయకులకు జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జీ  సద్బుద్ధి ప్రసాదించాలని గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున్,  జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, పార్టీ పట్టణ అధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ కొప్పుల  శ్రీనివాసరావు, మర్రి కొండలు, సయ్యద్ గఫర్,  ఆంజనేయులు, చిలకపాటి పొట్టి చెన్నయ్య,షేక్ షరీఫ్గా, షేక్ బుజ్జి, షేక్ వల్లి , మార్కాపురం పట్టణ యూత్ అధ్యక్షులు గొల్ల మారి కాశి రెడ్డి, బీసీ నాయకులు నాలి కొండయ్య , మైనారిటీ నాయకులు ఇబ్రహీం, పోత్తం ప్రసాద్,  రంగస్వామి, హనీష్, జంకె వెంకటరెడ్డి ,  మహిళా నాయకులు పోరుమామిళ్ల విజయలక్ష్మి గారు,  చెన్నా లక్ష్మి, మల్లికా, పెద్దక్క, భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: