సంక్రాతికి ప్రయాణీకుల రద్దీ 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

జంట నగరాలలో నివసించే ప్రజలు తమ తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. సంక్రాంతి పండుగ ను తమ తమ సొంత గ్రామాల్లో జరుపుకునేందుకు ఆసక్తి చూపుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇప్పటినుంచే సొంతూరు బాట పట్టారు. రైళ్లు, బస్సులను పెంచి ప్రయాణీకుల రద్దీ నీ తగ్గించే చర్యలు చేపట్టింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా కేంద్రాలకు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు ప్రైవేట్ వాహనాలు సైతం రెడీగా ఉన్నాయి. కరోనా జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ లోని అన్ని జిల్లా కేంద్రాలకు బస్సులు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. రైళ్ళ సంఖ్యను పెంచేందుకు రైల్వే శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టికెట్ ధర పెంచే ఆలోచనలో ప్రైవేట్ వాహన దారులు ఉన్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ధరల నియంత్రణ కోసం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కోళ్ళ పందేలు జోరుగా సాగే అవకాశాలు సన్నగిల్లాయి. కరోనా ప్రభావం వల్ల పందెం నిర్వాకులపై  పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: