మాజీ మంత్రి అఖిల ప్రియ...

బెయిల్ పిటీషన్ పై వాదనలు వాయిదా

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన  భూ వివాదం కేసులో తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై వాదనలు సోమవారానికి వాయిదా వేసినట్లు కోర్టు ప్రకటించింది. కస్టడీ పూర్తయిన తర్వాత ఆమెను మళ్ళీ 11 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ కు సైతం తరలించారు కోర్టు రిమాండ్ కు తరలించిన అనంతరం ఆమె తరఫు న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పై వాదనలను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.

బెయిల్ మంజూరు చేయకూడని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని కౌంటర్లో పోలీసులు పేర్కొన్నారు. ఇంకా విచారణ ప్రక్రియ పూర్తి కాలేదని, ఏ 3 గా ఉన్న భార్గవ్ రామ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసు కస్టడీ సమయంలో చేపట్టిన విచారణ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపింది. నార్త్ జోన్ డి సిపి కల్మేశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో ఆఖిల ప్రియను విచారణ చేపట్టిన విషయం విదితమే. ఆమె ఫోన్ కాల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది పిటీషన్ లో పేర్కొన్నారు. విచారణ ప్రక్రియ పూర్తి అయిందని, చార్జీ షీట్ దాఖలు చేయడమే తరువాయి భాగం అని బెయిల్ పిటీషన్ లో పేర్కొన్నారు. అందరి దృష్టి బెయిల్ మంజూరు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

✍️ రచయిత-డి.అనంత రఘు

అడ్వకేట్- హైద్రాబాద్.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: