జాతీయ రహదారి భద్రత మహోత్సవాల సందర్బంగా

మార్కాపురం పట్టణంలో...“ సడక్ సురక్ష - జీవన్ రక్ష“

భాగస్వామ్యమైన శ్రీ సాధన జూనియర్ కాలేజీ

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో  “ జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు “ సందర్భంగా ఆర్టీవో కె.ఎల్.రావు ఆధ్వర్యములో           “ సడక్ సురక్ష - జీవన్ రక్ష “ అనే వినాదంతో శ్రీ సాధన జూనియర్ కాలేజి నుంచి రోడ్డు ర్యాలీ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రహదారులపై జరిగే ప్రమాదాలకు ముఖ్యకారణం మనం రహదారి నియమాలు పాటించే విషయంలో  నిర్లక్ష్య వ్యవహారశైలియే ఒక కారణం, యువత నుద్ద్యేశించి ద్విచక్ర వాహనంతో ఇంటినుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరేవరకు ఆ ఇంటి ప్రతి ఒక్కరు ముఖ్యంగా కన్న తల్లిదండ్రుల మానసిక ఒత్తిడి వర్ణణాతీతమని,,దయచేసి ప్రతి ఒక్కరు రహదారి నియమాలు పాటిస్తూ తన జాగ్రత్తతో పాటు రహదారులపై ప్రయాణిస్తున్న పాదచారులతోపాటు, తన తోటి ప్రయాణికులను  కూడ రక్షించే విధంగా వుండాలని కోరారు. చివరిగా ప్రతి ఒక్కరు మీకు తెలిసిన మరో పదిమందికి రహదారి నియమాలను తెలియచేస్తూ తమవంతు బాధ్యత తీసుకోవాలని ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించిన శ్రీ సాధన జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి, ఆ కళాశాల ప్రిన్సిపాల్ అమర్నాధ్ రెడ్డికి విద్యార్ధులకు, కాలేజి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేశారు. 
శ్రీ సాధన కాలేజ్ అధినేత గోపాలుని లక్ష్మీ రమేష్ బాబు

 



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: