తమ హక్కులెంటో వినియోగదారులు తెలుసుకోవాలి

జానోజాగో సంఘం జాతీయ జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

తమ హక్కులెంటో వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతోవుందని జానోజాగో సంఘం జాతీయ జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని నడిగడ్డ లో *జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ
జానోజాగో సంఘం ఆధ్వర్యంలో ది కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పుస్తకావిష్కరణ
వినియోగదారులకు కొన్ని హక్కలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆ హక్కులను ఉపయోగించుకొని వినియోగదారుడు నష్టపోకుండా ఉండొచ్చన్నారు. వినియోగదారుల కోసం  ది కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్,-1986 కొన్ని హక్కులను అందించిందని ఆయన తెలిపారు. ఇది వినియోగదారుల కోసం ఎంతగానే ఉపయోగపడుతుందన్నారు. ఈ చట్టాలపై అవగాహన లేకనే వినియోగదారులు నష్టపోతున్న సందర్భాలు అధికంగా ఉన్నాయన్నారు. ఏదైనా కారణంగా వినియోగదారుడి తన కొనుగోలులో నష్టపోతే దానిపై కంజ్యూమర్ కోర్టుకు వెళ్లి న్యాయం పొందే హక్కు ఉందన్నారు.
అందుకే కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్,-1986 పై ప్రజల్లో అవగాహన చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం జానోజాగో సంఘం తరఫున తమ వంతు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్,-1986 చట్టం వినియోగదారుల ఆరు హక్కులను అందిస్తోందన్నారు. అది వినియోగదారుడి భద్రత హక్కు, తెలియజేసే హక్కు, ఎంచుకునే హక్కు, వినడానికి హక్కు;,పరిష్కారానికి హక్కుఅని అన్నారు ఈ కార్యక్రమంలో ఐయూఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా, ఆసరా సొసైటీ అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్, అబ్బాస్, జాఫర్, జాకీర్, నూర్, ఖాజా, అబ్దుల్ కలాం, మునావర్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: