జగత్ విఖ్యాత రెడ్డి, భార్గవ్ రామ్...

ముందస్తు బెయిల్ విచారణ

మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై సైతం విచారణకు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

సికింద్రాబాద్ జిల్లా కోర్టులో బుధవారం నాడు మాజీ మంత్రి అఖిల ప్రియతో పాటు భర్త భార్గవ్ రామ్, ఆ మె  సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి ముందస్తు బెయిల్ విచారణ చేపట్టనుంది. 395 ఐ పిసి సెక్షన్ (దోపిడీ) ను పోలీసులు జోడించిన విషయం విదితమే. రేపటితో 14 రోజుల రిమాండ్ గడువు పూర్తవుతున్న సందర్భంగా ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినేందుకు కోర్టు సిద్దంగా ఉంది. అదేవిధంగా పోలీసుల కౌంటర్ ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైతం వాదనలు వినిపించే అవకాశం ఉంది. ముందస్తు బెయిల్ విచారణ వాదనల్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోనుంది. పోలీసుల కేసు డైరీ అందిన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు కోర్టు వింటుంది. మొదట ఆమె తరఫు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం పిపి వాదనల తర్వాత తీర్పు కోసం కోర్టు వాయిదా వేస్తుంది. అఖిల ప్రియ ఆరోగ్య పరిస్థితి సున్నితంగా ఉన్నట్లు మెడికల్ రిపోర్టులను కోర్టు కు సమర్పించనున్నారు. బెయిల్ మంజూరు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

✍️-రిపోర్టింగ్ -డి.అనంత రఘు

అడ్వకేట్. హైదరాబాద్.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: