ఐయూఎంఎల్ ఆధ్వర్యంలో...

ఉచిత మెడికల్ క్యాంప్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

ఐ యు ఎం ఎల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ జరిగింది. ఆదివారంనాడు నంద్యాల లోని మూడవ వార్డు లో ఐ యు ఎం ఎల్ మూడో వార్డు ఇంచార్జ్ ఎస్ అబ్బాస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్  సయ్యద్ ఫజులుల్లా (ఎండి బెంగళూరు), డాక్టర్ సయ్యద్ జాఫర్ లా (ఎం బి బి ఎస్ )శాంతి రామ్ హాస్పిటల్, డాక్టర్ ఇలియాస్ (ఎం బి బి ఎస్ )పాల్గొన్నారు. ప్రజలకు ఉచిత బిపి, షుగర్ పరీక్షలు, అనేక రోగాలపై ప్రజలకు ఉచిత మందులు పంపిణీ చేశారు. సుమారుగా మూడు వందల మంది ప్రజలు పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఐయూఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా మాట్లాడుతూ అబ్బాస్ డాక్టర్లను పిలిపించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం పేదలకు ఆర్థిక సహాయం అందించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐ యు ఎం ఎల్ రఫీ దీన్ మౌలానా  అలీమ్ నూర్ కాజా జాఫర్ మహబూబ్ బాషా సాజిద్ ఉమర్ షఫీ ఉల్ల తదితరులు పాల్గొన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: