మూవ్ మెంట్ ఫర్ పీస్ & జస్టీస్ రాష్ట్ర కోశాధికారి...

షేక్. అబ్దుల్ రజాక్ ఆధ్వర్యములో..

పేద ముస్లిం యువతిని అదుకున్న ఏంపీజే


సమస్య పరిష్కారానికి సహకరించిన  ఎంపీజే 
రాష్ట్ర కోశాధికారి

షేక్. అబ్దుల్ రజాక్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

గత ఆరునెలల క్రితం ప్రేమ వ్యామోహం లో పడి, వడ్డేర కులం యువకుడితో వివాహం చేసుకుని మానసిక, శారీరక బాధలు పడుతున్న యువతిని మూవ్ మెంట్ ఫర్ పీస్ & జస్టీస్ (ఎంపీజే )ఆదుకొంది. తన ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతూ నరకం అనుభవిస్తున్న పేద ముస్లిం యువతి విషయం మార్కాపురం ఎంపీజే కార్యకర్త ద్వారా తెలియడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు ఎక్కింది. ఎంపీజే  నేతలు పోలీసు స్టేషన్ లో ఎస్ఐ ని కలిసి పేద యువతి బాధలను వివరించి కేసుపెట్టారు.
సమస్య పరిష్కారంలో పాలుపంచుకొన్న ఎంపీజే నేతలు

 ఆ యువతిని పెళ్లాడిని వ్యక్తిని, అతని తల్లితండ్రులకు పెద్దల సమక్షములో కౌన్సెలింగ్ ఇప్పించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా వివాహాన్ని రద్దుచేయించి  ఎవరికి ఎటువంటి సంబంధం లేకుండా విముక్తి చేయించాయి. ఎంపీజే చేసిన ఈ సహాయాన్ని పేద ముస్లిం యువతి, ఆమె తల్లి తండ్రులు ఎంపీజే సంస్ధకు చాలా ఋణపడి ఉంటామని తెలిపారు.ఈ వ్యవహారంలో ఎంపీజే రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర ఫౌండర్ మెంబర్ షేక్ అబ్దుల్ రసూల్, కార్యకర్త షేక్ రఫీ, ఇస్మాయిల్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: