లూయిస్ బ్రెయిలీ మనోధైర్యం అందరికీ ఆదర్శం

 ఘనంగా లూయిస్ బ్రెయిలీ దినోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

 మార్కాపురం పట్టణములోని జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్ధుల సమక్షములో , “ లూయిస్ బ్రెయిలీ దినోత్సవం “ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి  ఆధ్వర్యములో  ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి,  ఉపాధ్యాయులు వరిమడుగు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ బ్రెయిలీ జీవిత చరిత్రను వివరించారు.  లూయిస్ బ్రెయిలీ నాలుగు సంవత్సరాల వయస్సులోనే ప్రమాద వశాత్తు తన రెండు కళ్ళను కోల్పోయిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ.   
              చిన్న తనమునుంచే చదువుపై ఆసక్తిని గమనించిన లూయిస్ బ్రెయిలీ తండ్రి చిన్నచిన్న మేకులతో చక్కపైన అక్షరాలను కూర్చి చేతివేళ్లతో తడుముతూ ఎలా చదవాలో, ఏ విధంగా గుర్తుపట్టాలో మెలుకువలను నేర్పిస్తూ చదివించేవారు. తను కూడా పట్టుదలతో కష్టపడుతూ చదువుకుంటూ పది సంవత్సరాలలోనే  నేషనల్ ఇనిస్ట్యూట్ ద్వారా స్కాలర్షిప్ పొందే అర్హతను సంపాదించుకున్నాడు. ఆ తరువాత 17 సంవత్సరాల వయస్సులో తాను చదివిన కాలేజిలోనే  ప్రొఫెసర్ గా చేరి తనలాంటి అంధులైన వారికోసం తన వంతు బాధ్యతగా ఒక పాఠశాలను ప్రారంభించి తను నేర్చుకున్న విధానాలను వారికి తెలియపరుస్తూ,
వారిలో అంధులమనే భావనలను పోగొట్టి వారిలో మనోధైర్యాన్ని నింపేవారని, యింకా ఎన్నో విషయాలతోకూడిన వారి గొప్పతనాలను విద్యార్ధులకు తెలియచేశారు. ఈ కార్యక్రమములో వరిమడుగు వెంకట రామిరెడ్డి, జి.ఎల్.రమేష్ బాబు, ఎన్. వెంకటేశ్వర్లు, ఉషారాణి, డి.వెంకట రెడ్డి, ఆంజనేయులు, డి.వి.వీరారెడ్డి, ఎస్. భాస్కర్ రెడ్డి, ఐ.వినోద్,మరియు ఉపాధ్యాయులు పాల్గోన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: