వైభవంగా జావేద్ పాషా రిసెప్షన్

బంధుమిత్రుల మధ్య అట్టహాసంగా వలీమా డిన్నర్ 

(జానోజాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి) 

ప్రముఖ వ్యాపారవేత్త మహమ్మద్ రహీమ్ పాషా తమ్ముడు జావేద్ పాషా రిసెప్షన్ (వలీమా డిన్నర్) శుక్రవారం రాత్రి   హైదరాబాద్  చాంద్రాయణగుట్ట లోని కాశీష్ ఫంక్షన్ హాల్ లో బంధుమిత్రుల మధ్య అట్టహాసంగా జరిగింది.  హైదరాబాద్ పార్శిగుట్టకు చెందిన మహమ్మద్ జహంగీర్ కుమార్తె ఆయేషా తో గురువారం రాత్రి  హైదరాబాద్ లో నిఖా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన వలీమా డిన్నర్ విభిన్న తరహాలో ఎన్నో..ఎన్నెన్నో రుచులతో  అందర్నీ అలరించే రీతిలో సాగింది. ఈ  సందర్బంగా జరిగిన వలీమా డిన్నర్ కు తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర నాయకుడు, స్టేట్ హెల్త్ కన్వీనర్ ఏ. రాజేష్- శిల్ప (ప్రముఖ న్యాయవాది) దంపతులు,  కుమారుడు సూర్య అన్వేష్, కూతురు సాహిత్య,  దక్కన్ క్రానికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నంది అవార్డు గ్రహీత, మైనారిటీ జర్నలిస్ట్ ఫ్రంట్ జాయింట్ సెక్రెటరీ ఎం.డి. అబ్దుల్, 6టీవీ జర్నలిస్ట్ సలీం, మిత్రులు రాజు, దినేష్, జరాడ్ జేవియర్ తో పాటు బంధువులైన షాదాబ్-షబానా, ఖాజా-జరీనా, మహమ్మద్ హఫీజ్ - షాహీన్ దంపతులు, గౌసియా, మున్నీబేగం, గౌసియా (చింతల్) హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
బంధుమిత్రుల అభినందనలతో జరిగిన ఈ  వలీమా డిన్నర్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. తల్లి రజియా కొడుకు జావేద్ పాషా రిసెప్షన్ ను చూసి ఆనందపడిపోయింది.  వలీమా డిన్నర్ కు హాజరైన ప్రముఖులు జావేద్ పాషా తండ్రి మహమ్మద్ అబ్దుల్ గఫార్ ను గుర్తుతెచ్చుకుంటూ ఆయన బతికి ఉంటే ఎంతో ఆనందంగా ఉండేదని, కొడుకు జావేద్ పాషా వివాహాన్ని కనులారా చూసి తరించేవారని, అయినప్పటికీ  తండ్రి లేని లోటును మరచిపోయేలా పెద్ద కొడుకు  మహమ్మద్ రహీమ్ పాషా ముందుండి పెళ్లి జరిపించిన వైనం అందరికీ గుర్తుండేలా చేసింది. ఈ వలీమా డిన్నర్ కు వచ్చిన ప్రతిఒక్కరు రహీమ్ పాషాను అభినందిస్తూ శుభాకాంక్షలు అందజేశారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

1 comments: